Share News

KCR: రాబోయే రోజులు బీఆర్‌ఎస్‌వే

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:58 AM

రాబోయే రోజులు బీఆర్‌ఎ్‌సవేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎ్‌సకు తిరుగుండదని, ప్రజలు కాంగ్రెస్‌ మోసాన్ని అర్థం చేసుకున్నారని చెప్పారు.

KCR: రాబోయే రోజులు బీఆర్‌ఎస్‌వే

  • ప్రజలకు కాంగ్రెస్‌ మోసం అర్థమైంది

  • రజతోత్సవ సభను జయప్రదం చేయాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌/గజ్వేల్‌/మర్కుక్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాబోయే రోజులు బీఆర్‌ఎ్‌సవేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎ్‌సకు తిరుగుండదని, ప్రజలు కాంగ్రెస్‌ మోసాన్ని అర్థం చేసుకున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


ఉమ్మడి మెదక్‌ జిల్లా సమన్వయకర్తగా హరీశ్‌రావు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సమన్వయకర్తగా వేముల ప్రశాంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకొని సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని పిలుపునిచ్చారు. పది లక్షల మంది తరలివచ్చే సభకు సరైన వాహనాలను ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 03:58 AM