KCR: ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావచ్చు

ABN, Publish Date - Apr 05 , 2025 | 03:38 AM

తాజా పరిణామాలు చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి.. పార్టీపరంగా సిద్ధంగా ఉందాం అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

KCR: ఎప్పుడైనా ఉప ఎన్నికలు రావచ్చు
  • పార్టీపరంగా సిద్ధంగా ఉందాం

  • ఏ ఎన్నిక జరిగినా మనదే విజయం

  • కంచ గచ్చిబౌలిలో సర్కారీ విధ్వంసం

  • బుల్డోజర్లతో అమానుష చర్యలు

  • దేశంలో బీజేపీ గ్రాఫ్‌ పడిపోతోంది: కేసీఆర్‌

హైదరాబాద్‌, గజ్వేల్‌/మర్కుక్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘‘తాజా పరిణామాలు చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి.. పార్టీపరంగా సిద్ధంగా ఉందాం’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఏ ఎన్నిక జరిగినా బీఆర్‌ఎ్‌సకు విజయం దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ అధ్యక్షులతో శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈనెల 27న వరంగల్‌లో చేపట్టనున్న భారీ బహిరంగ సభ ఏర్పాటు, జన సమీకరణ వంటి అంశాలపై గులాబీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ విధ్వంసానికి పాల్పడుతోందని, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.


అక్కడి అటవీ భూముల్లో చెట్లను నరకడమే కాకుండా పక్షులు, జంతుజాలానికి ఇబ్బంది కలిగించేలా బుల్డోజర్లతో ప్రభుత్వం అమానుష చర్యలకు పాల్పడుతోందని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలో బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభావం తగ్గిపోయి.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలకు ఇబ్బందులు తప్పవు. అధికార పార్టీ స్వయంకృతాపరాఽధంతో ప్రజలకు దూరమవుతోంది. ఈ సమయంలో అప్రమత్తంగా ఉందాం. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ప్రజలకు దగ్గరగా ఉంటూ ముందుకు వెళ్దాం’’ అని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి ఓటేశారని, వారి మాటలు మోసపూరితమని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణవ్యాప్తంగా పండుగలా జరపాలని, ప్రతి గ్రామం, వార్డు పరిధిలో పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. వరంగల్‌ సభకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చేలా దృష్టిసారించాలన్నారు. సభకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం ఖాయమని, సభకు తరలి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లకు సూచించారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:38 AM