ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DK Aruna: ఢిల్లీలో బీజేపీ గెలుపుపై డీకే అరుణ ఏమన్నారంటే..

ABN, Publish Date - Feb 09 , 2025 | 01:00 PM

ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రేస్ నేతలు ఇస్తామన్న ఆరు గ్యాంరెంటీ పథకాలు అటకెక్కాయని, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. ప్రధాన ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే నిధులు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు.

DK Aaruna press meet

మహబూబ్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీ (Delhi)లో ప్రజలు బీజేపీ (BJP)ని గెలిపించారని, మాజీ సీఎం కేజ్రీనాల్ (Ex CM Kejriwal) అవినీతిని ప్రజలు ఎండగెట్టారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ (BJP MP) డీకే అరుణ (DK Aruna) అన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుపై స్పందించిన ఆమె ఆదివారం మహబూబ్‌నగర్‌లో జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రేస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. స్దానిక సంస్దల్లో లబ్దికోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకోమాట చెబుతుందని, రుణమాపీ, రైతు భరోసా అమలులో ప్రభుత్వం విఫలమయ్యిందని డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

వైఎస్సార్‌సీపీకి షాకులు మీద షాకులు..


కాంగ్రేస్ ఆరు గ్యాంరెంటీలు అటకెక్కాయి..

ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రేస్ నేతలు ఇస్తామన్న ఆరు గ్యాంరెంటీ పథకాలు అటకెక్కాయని, డీకే అరుణ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. ప్రధాన ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే నిధులు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు. ఏ పథకాలు అమలు చేయలేక స్ధానిక సంస్దల ఎన్నికలపై ప్రభుత్వం హాడావిడి చేస్తోందని మండిపడ్డారు. స్దానిక సంస్దల ఎన్నికల్లో కాంగ్రేస్‌ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు అమలవుతాయని అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏడాది గడచినా రాష్ట్రంలో పాలన గాడిలో పడలేదన్నారు. ఇచ్చిన హమీలు నిలబెట్టుకోకుంటే కేసీఆర్, కేజ్రీవాల్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... బీజేపీని బలపరచాలని ఆమె పిలుపిచ్చారు. కేంద్రం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్దితే లేదని, బీసీ కులగణనకు బీజేపీ, కేంద్రం వ్యతిరేకం కాదన్నారు. సర్వేలో చిత్తశుద్ది లోపించిందని, లక్షలాది మంది వివరాలు కులగణనలో నమోదు కాలేదని డీకే అరుణ విమర్శించారు.


ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. 27 ఏళ్ల తర్వాత అవినీతి సామ్రాజ్యం హస్తినలో కూలిందని అన్నారు. మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారని ఉద్ఘాటించారు. తాను ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు. దేశ రాజధానిలో మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను ఉండొచ్చని.. అది హై కమండ్ నిర్ణయమని చెప్పారు. రేవంత్ రెడ్డికి లోకల్ బాడి ఎన్నికల భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు అంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం ఎదురు అవుతోందని డీకే అరుణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అనంతపురంలో ఖాకీ సినిమా తరహా ఘటన

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి..

దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 09 , 2025 | 01:00 PM