Share News

అలంపూర్‌ దవాఖానలో వైద్యులను నియమించాలి

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:34 PM

అ లంపూర్‌ చౌరస్తాలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని ఎం ఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీఎస్‌ నాయకులు కోరారు.

అలంపూర్‌ దవాఖానలో వైద్యులను నియమించాలి

అయిజ టౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): అ లంపూర్‌ చౌరస్తాలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని ఎం ఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీఎస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం అయిజలోని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ప్రజలు ఏదైనా అత్యవసర వైద్యం కోసం వెళ్లాలంటే కర్నూలు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అక్కడ వైద్యం చేసేందుకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అందడంలేదని తెలిపారు. అలంపూర్‌ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను నియమించి, అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజు, సామెల్‌, చార్లెస్‌, ఆనందరావు, నాగరాజు, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:34 PM