సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:30 PM
సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల కు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల కు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దేవసహాయం, జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్‌గోపిడీ, సంబంధిత శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచు ప్రజల ఆరాధ్య దైవం సలేశ్వరం లింగమయ్య జాతరను ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరపనున్నట్లు తెలిపా రు. జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు కావాల్సిన వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. జాతర రోజుల్లో వైద్యాధికారులు, జిల్లా పంచాయతీశాఖ, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గత ఏడాది అనుభవా లను దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. అచ్చంపేట ఆర్డీవో జాతర నోడల్ అధికారిగా ఉంటారని కలెక్టర్ వివరించారు.
వేసవి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
చిన్న పిల్లలు, వృద్దులు వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై పలు సూచనలు చేశారు. జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఎండ కార ణంగా అస్వస్థతకు గురైన వారు వెంటనే సమీప పీహెచ్‌సీకి వెళ్లి వైద్య సహాయం పొందాలన్నారు. ఉపాధిహామీ క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు అందించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మీ, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, జిల్లా అధికారులు తదిత రులు పాల్గొన్నారు.