Share News

సన్నబియ్యంతో పేదలకు ఆహార భద్రత

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:32 PM

రాష్ట్రంలో నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు కాంగ్రెస్‌ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సరిత అన్నారు.

సన్నబియ్యంతో పేదలకు ఆహార భద్రత
కేటీదొడ్డిలో భోజనం చేస్తున్న సరిత

- జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత

కేటీదొడ్డి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు కాంగ్రెస్‌ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సరిత అన్నారు. ఈపథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, 80శాతానికి పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ నిరుపేదల ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలి పారు. సోమవారం కేటీదొడ్డికి చెందిన లబ్ధిదారు హరిజన ముద్దమ్మ, తిప్పన్న ఇంట్లో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని ఆ కుటుంబ సభ్యులు, గ్రామ మహిళలతో కలి సి భోజనం చేశారు. ఈసందర్భంగా గ్రామ మహిళలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సరితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు ఆనంద్‌, వెంకట్రా మిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీను, తిరుపతి, జంగిల ప్ప, రామకృష్ణ, సూరి, సురేష్‌, ఆంజనేయులు, సిద్దన్‌గౌడ్‌, మహదేవ్‌, గోవిందు, రాఘవేంద్ర, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:33 PM