Share News

ఉగాది అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలి

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:25 PM

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మనందరికి శుభాలతో పాటు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు.

ఉగాది అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలి
శిల్పారామంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మనందరికి శుభాలతో పాటు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం ఉగాది సందర్భంగా మహబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్‌బండ్‌ సమీపంలోని శిల్పరామంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. పంచాంగ శ్రవణ కర్త శ్రావణ్‌కుమార్‌ పంచాంగ శ్రవనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్మే మాట్లాడుతూ ఈ తెలుగు నూతన సంవత్సరంలో మహబూబ్‌నగర్‌ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతీ ఒక్కరికి వారి ఆశలు, ఆకాంక్షలు నేరవేరాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన 12 మంది ప్రముఖులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉగాది పచ్చడిని ఎమ్మెల్యే స్వీకరించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నరసింహ్మరెడ్డి, మూడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనితరెడ్డి, జిల్లా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షడు ఎన్పీ వెంకటేష్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు సత్తూర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ ఖాద్రి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మమేందర్‌, కాంగ్రెస్‌ నాయకులు గజగౌని గిరిధర్‌గౌడ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:25 PM