Share News

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:31 PM

వరి కోతలు ప్రారంభ మైన అన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల ని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారుల ను ఆదేశించారు.

  కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): వరి కోతలు ప్రారంభ మైన అన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల ని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారుల ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పై సోమవారం సాయంత్రం కలెక్ట రేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రం లో తేమ యంత్రాలు, యంత్రాలు, టార్ఫాలిన్‌లు కవర్లు, గన్నీ బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే మిషన్లను అందుబాటులో ఉంచు కోవాలని ఆదే శించారు. జిల్లాలో దాదాపు 462 కొనుగో లు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ఆత్మకూరు, కొత్తకోట, అమరచింత, మదనాపూర్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యా యని, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. యాసంగిలో వనపర్తి జిల్లాలో 1,48, 596 ఎకరాల్లో వరి సాగు చేశార ని, 4.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఇందులో స్థానిక అవసరాలు, నేరుగా మిల్లులకు అమ్ము కోవడం వంటివి పోను దాదాపు 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగో లు కేంద్రాలకు వస్తుందని తెలిపారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశిం చారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి విశ్వనాథ్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్‌, మార్కెటింగ్‌ అధికారి స్వరణ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:31 PM