భానుడి భగభగ వరణుడి వడగళ్లు
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:28 PM
పాలమూరులో అకాలవానలు కురుస్తున్నాయి.

మహబూబ్‌నగర్/నారాయణపేట/రాజాపూర్/వనపర్తిటౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): పాలమూరులో అకాలవానలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరికాగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది. జిల్లా కేం ద్రంలో అరగంటపాటు మోస్తరు వాన కురిసింది. రైతు మార్కెట్‌లో వడగళ్ల వాన కురిసింది. వర్షంతో పాటు కొద్దిసేపు వడగళ్లు కురవడంతో జనం వాటిని ఆసక్తిగా గమనించారు. పాలమూరులో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజాపూర్ మండల కేంద్రంలో కూడా వడగళ్ల వాన కురిసింది. దాదాపు 20 నిమిషాల పాటు ఓ మోస్తరు వాన కురిసింది. అయితే మండలాలు గ్రామాల్లో ఎక్కడా వాన కురవకపోవ డంతో అన్నదాతలు ఊపిరిపీల్చుకున్నారు. వరి కోతలు సాగుతున్న సమయంలో వర్షం పడితే తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నదాతలు ఆందో ళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లాలో గరిష్ఠంగా 37 డిగ్రీలు, కనిష్ఠంగా 24 డిగ్రీల ఉషో ్ణగ్రత నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో గరిష్ఠంగా 37 డిగ్రీలు, కనిష్ఠంగా 26 డిగ్రీలు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజలో గరిష్ఠం 40.1, కనిష్ఠం 26.4 డిగ్రీలు నమోదైంది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో గరిష్ఠంగా 39.7 డిగ్రీలు కనిష్ఠంగా ఖిల్లాఘణపురం మండలంలో 37.7 డిగ్రీలు నమోదైంది.