Share News

కమనీయం.. సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:01 PM

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. భక్తు లు శ్రీరామ నామస్మరణలతో స్మరించారు.

కమనీయం.. సీతారాముల కల్యాణం
పేట మూలహనుమాన్‌ దేవాలయం వద్ద కల్యాణం జరిపిస్తున్న జ్యోషి రఘుప్రేమ్‌

- మరికల్‌లో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు

- వేడుకకు హాజరైన భక్తజనం

- పేటలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ

- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నారాయణపేట/ నారాయణపేటటౌన్‌/ధన్వాడ/మరికల్‌/నారాయణపేటరూరల్‌/కోస్గి/మద్దూర్‌/కొత్తపల్లి/మక్తల్‌/ మక్తల్‌ రూరల్‌/మాగనూరు/కోస్గి రూరల్‌/ దామరగిద్ద, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): నారా యణపేట జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. భక్తు లు శ్రీరామ నామస్మరణలతో స్మరించారు. నారా యణపేట మూల హనుమాన్‌ మందిరంలో ఆలయ అర్చకుడు శ్రీపతి, భక్త బృందం ఆధ్వ ర్యంలో జోషి రఘుప్రేమచారి, విద్వాన్‌ హరీశ్‌ ఆచార్య రాములోరి కల్యాణం నిర్వహించగా కా ర్యక్రమాన్ని భక్తులు తిలకించారు. హాజరైన భ క్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చే పట్టారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్ర మాలు పలువురిని అలరించాయి. మూల హ నుమాన్‌ భక్త బృందం శంకర్‌, రాజు, కొనంగేరి హన్మంతు, గందె రవికాంత్‌, గోపాల్‌రెడ్డి, వెంక టేష్‌, అనిల్‌, రవిగౌడ్‌, సంతోష్‌కుమార్‌, మురళీ భట్టడ్‌, పవన్‌లాహోటి, డిపో మేనేజర్‌ లావణ్య, రవితేజ, రాఘవేంద్ర తదితరులున్నారు. అలాగే బ్రాహ్మణ్‌వాడి రామాలయంలో డోలారోహణం జరిగింది. సంత్‌మఠ్‌ రామాలయంలో యజ్ఞ నారాయణ పురోహిత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూ జలు జరిగాయి. అనంతసేన ఆలయంలో అర్చ కుడు శ్రీపాద్‌ అధ్వర్యంలో విశేష పూజ కార్యక్ర మాలతో పాటు, సీతారాముల కల్యాణ వేడు కలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శక్తి పీఠంలో స్వామి శాంతానంద్‌ నేతృత్వంలో సీతా రాముల కల్యాణ వేడుకలను అత్యంత శోభా యమానంగా జరిపించారు. టీవీ సీరియల్‌ నటులు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి వే డుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయా ఆల యాల వద్ద భక్తులకు అన్నదానం చేపట్టారు.

భారీ బైక్‌ ర్యాలీ

శ్రీరామనవమి సందర్భంగా బుధవారం వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పళ్ల హను మాన్‌ మందిరం వద్ద స్వామివారికి ఎస్పీ యో గేష్‌గౌతమ్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూ రావు నామాజీ, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డా క్టర్‌ రాంబాబు ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం భారీ బైక్‌ ర్యాలీ పురవీధుల గుండా రా మాలయం వరకు నిర్వహించారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శివకుమార్‌రెడ్డి, భీష్మరాజ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రాజ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి శివ కుమార్‌, పట్టణ అధ్యక్షుడు మురళీభట్టడ్‌, ప్రవీణ్‌, వడ్ల శ్రావ ణ్‌, వెంకటేష్‌, బిల్డర్‌ వెంకట్రాములు, గోపాల్‌యా దవ్‌ తదితరులున్నారు.

అదేవిధంగా, ధన్వాడలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. కల్యాణో త్సవానికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డాక్టర్‌ రాంమోహన్‌, డాక్టర్‌ మీనాక్షి దంపతులు, కెంచె నారాయణ, సుంకు లక్ష్మీనారాయణ దంపతులు పాల్గొన్నారు.

మరికల్‌ మండల కేంద్రంలోని మాధవరం రహదారిపైనున్న ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన సీతారాముల కల్యాణో త్సవానికి ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమ ర్పించారు. అర్చకుడు నాగరాజుశర్మ వేద మం త్రోచ్ఛరణలతో ఎమ్మెల్యే దంపతులతో స్వామివా రి కల్యాణం నిర్వహించారు. తీలేరు గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.ప్రశాంత్‌ కుమార్‌రెడ్డి దంపతులు స్వామివారి కల్యాణం జరిపించారు.

పేట మండలంలోని అప్పిరెడ్డిపల్లి, రామ దేవునిగుట్ట, తిర్మలాపూర్‌, తిర్మల్‌దేవునిపల్లిలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో ఎ మ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అప్పిరెడ్డిపల్లి రామదేవుని గుట్టపై యువకుల అడుగుల భజన చూపరులను ఆకట్టుకుంది. భీష్మరాజ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రాజ్‌కుమార్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోయిన్‌పల్లిలో కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహించారు.

కోస్గి పట్టణంలోని రామాలయంలో సీతా రాముల కల్యాణం వైభవంగా సాగింది. మండ లంలోని గ్రామాల్లో కూడా సీతారాముల కల్యా ణం చూడముచ్చటగా సాగింది.

మద్దూర్‌ మండలం చింతల్‌దిన్నెలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. అలాగే వివిఽఽఽధ గ్రామా ల్లో జరిగిన వేడుకల్లో పలు పార్టీల మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

కొత్తపల్లి మండలం భూనీడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పూజారులు రా మాచారి, మోనయ్యచారిలు స్వామివారి కల్యా ణాన్ని నిర్వహించారు. ముద్దెలి రమాకాంత్‌రెడ్డి (ఆర్మీ), నింగనోల్ల కుర్మంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మక్తల్‌ పట్టణంలోని రాంలీలా మైదానంలో ఆదివారం ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అం తకు ముందు పడమటి ఆంజ నేయస్వామి ఆలయం నుంచి సీతారాముల విగ్రహాలు, తలంబ్రాలను ఎమ్మెల్యే వాకి టి శ్రీహరి భాజాభజంత్రీల నడుమ రాంలీల మైదానానికి తీసుకువచ్చారు. బీకేఆర్‌ ఫౌండే షన్‌ అధినేత గవినోళ్ల బాలకృష్ణారె డ్డి తన స్వంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని వినాయక్‌నగర్‌ చక్కెర ఆంజ నేయస్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి నాయకులు ల క్ష్మారెడ్డి, బాలకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయ కుడు కొండయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు రా జుల ఆశిరెడ్డి, కట్టసురేష్‌కుమార్‌గుప్తా, గణే ష్‌కుమార్‌, బోయ రవికుమార్‌ కల్లూరి గో వర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

మక్తల్‌ మండలం సంగంబండలో బీకే ఆర్‌ ఫౌండేషన్‌ అధినేత బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హా జరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాగనూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం ఆదివారం ఘనంగా జరిగింది. మాగనూరులో ఉత్సవ కమి టీ సభ్యులు అశోక్‌గౌడ్‌, పురుషోత్తంరెడ్డి, చక్ర పాణిరెడ్డి, కృష్ణయ్య, ప్రహ్లాద్‌రెడ్డి, నరసింహరెడ్డి, వాకిటి శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, ఉజ్జల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

కోస్గి మండలంతో పాటు, గుండుమాల్‌ మం డల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో రాములోరి కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు బెల్లం పానకం, వడపప్పు పంచిపెట్టి, భోజనాలు వడ్డించారు.

దామరగిద్ద మండల కేంద్రంలోని రామాల యంలో నిర్వహించిన వేడుకల్లో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, భీష్మరాజ్‌ ఫౌండే షన్‌ చైర్మన్‌ డా.రాజ్‌కుమార్‌రెడ్డి పాల్గొని ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాం గ్రెస్‌ నాయకులు బాల్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:01 PM