రేషన్ దుకాణాలకు సన్న బియ్యం వేగంగా చేర్చాలి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:07 AM
రేషన్ దుకాణాల కు సన్న బియ్యం రవాణా పంపిణీని వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా , ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రేషన్ దుకాణాల కు సన్న బియ్యం రవాణా పంపిణీని వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాల యం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం సరఫరాపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కా న్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు వేగంగా సన్న బి య్యం పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సన్న బియ్యం రవాణాను నూతన ఆహార భద్రత కా ర్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగ వంతం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటే శ్వర్లు, పౌర సరఫరాల డీఎం జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.