ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:11 PM

Telangana: మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. చిట్కుల్ మండలం చాముండేశ్వరి దేవాలయ సమీపంలో రైతుల కంటపడింది మొసలి. మొసలిని చూసిన వెంటనే సదరు రైతు భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు మొసలిని చూసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు.

Manjira River

మెదక్ జిల్లా, జనవరి 11: మొసలి.. ఆ పేరు వింటేనే ప్రజలకు హడల్. చెరువులు, నదులల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొసలి పట్టు పట్టిందంటే.. దాని బారి నుంచి బయటపడటం కష్టమే అని చెప్పుకోవాలి. ఒక్కసారి మొసలి బారిన పడిన వాడు ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. నదుల్లో, చెరువుల్లో చేపల వేటకు వెళ్లే వారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మొసలి కంట పడకుండా వేటాడాల్సి ఉంటుంది. మొసలి ఎంతో తెలివిగా మనుషులను కానీ జంతువులను కానీ వేటాడుతుంది. దాని బారిన పడిన జంతువు ఏదీ కూడా బయటపడింది లేదు. అంత బలం ఉంటుంది మొసలికి. సాధారణంగా జనావాసంలోకి మొసళ్లు రావడం చాలా అరుదు. అవి వచ్చాయంటే జనం భయంతో పరుగులు పెట్టాల్సిందే. తాజాగా మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. చిట్కుల్ మండలం చాముండేశ్వరి దేవాలయ సమీపంలో రైతుల కంటపడింది మొసలి. మొసలిని చూసిన వెంటనే సదరు రైతు భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు మొసలిని చూసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు.


కాగా.. గత 15 రోజుల క్రితం ఆందోల్ మండలం అల్మాయిపేట శివారులో మంజీరా నదిలో మొసలి కనిపించిన విషయం తెలిసిందే. మంజీరా నది ఒడ్డుపై ఓ బండరాయిపై మొసలి సేద తీరుతున్న దృశ్యం రైతుల కంట పడింది. నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు, స్థానిక రైతులు.. మొసలి ఉండటాన్ని గుర్తించారు. దీంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మంజీరా నదిలో మూడు మొసళ్ళు సంచరిస్తున్నట్టు మత్స్యకారులు వెల్లడించారు. అయితే మంజీరా నదిలో మొసళ్లు సంచరిస్తుండడంతో నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకలకాపరులు, రైతులు వణికిపోతున్న పరిస్థితి. మొసలిని చూసిన కొందరు దాన్ని తమ కెమెరాలో బంధించారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారింది.

రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. ఏంటంటే..


మరోవైపు మంజీరా నదిలో మొసలి సంచరిస్తున్న విషయాన్ని మత్స్యకారులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు మొసలి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. మొసలి సంచరిస్తున్న నేపథ్యంలో మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే వీలైంత త్వరగా మొసళ్లను పట్టుకుని అక్కడ నుంచి తరలించాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు. మొసళ్లు ఉండటం వల్ల చేపల వేటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నట్లు వారు చెబుతున్నారు. మరి మంజీరా నదిలో ఉన్న మూడు మొసళ్లపై అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


ఇవి కూడా చదవండి...

Sankranti: పల్లెలకు కదిలిన జనం.. బస్సులు, ట్రైన్‌లు ఫుల్

Sankranti: సంక్రాంతి పండుగ వేళ.. ఆ బస్సులపై అధికారుల నిఘా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 11 , 2025 | 01:29 PM