ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

ABN, Publish Date - Jan 10 , 2025 | 04:37 AM

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చే యాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

  • ప్రారంభించిన మంత్రి పొంగులేటి

  • పథకంలో పారదర్శకతకు పెద్దపీట

  • దరఖాస్తుల పరిశీలన 95% పూర్తి

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చే యాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ (indirammaindlu.telangana.gov.in)ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందులోని గ్రీవెన్స్‌ మాడ్యూల్‌కు అందిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారు ఫోన్‌కు సందేశం ద్వారా తెలియజేయనున్నట్టు తెలిపారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ను ప్రారంభించిన సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. మాడ్యూల్‌కు వచ్చిన ఫిర్యాదులు గ్రామాల పరిధిలో ఎంపీడీవోలు, పట్టణాల్లో మునిసిపల్‌ కమిషనర్ల ద్వారా సంబంధిత అధికారులకు వెళ్తాయని తెలిపారు.


ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పథకం అమలులో మధ్యవర్తులకు తావులేకుండా అర్హులైన వారికే ఇల్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులు 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పారు. చివరి లబ్ధిదారుని వరకు ఇండ్లను మంజూరు చేసి నిర్మించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ప్రభుత్వానికి అందిన దరఖాస్తుల పరిశీలన బుధవారంనాటికి హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో 95 శాతం మేర పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 88శాతం వరకు పూర్తయిందన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఇళ్ల నిర్మాణానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.

Updated Date - Jan 10 , 2025 | 04:37 AM