Seethakka: హైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషిహైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషి
ABN, Publish Date - Jan 04 , 2025 | 04:00 AM
సావిత్రిబాయి ఫూలే చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఏదైనా వర్సిటీకి సావిత్రిబాయి పేరు పెట్టాలని సీఎంను కోరుతా: మంత్రి సీతక్క
క్యాబినెట్‌లో మరో ఇద్దరు బీసీలకు అవకాశం!: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
రవీంద్రభారతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సావిత్రిబాయి ఫూలే చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఫూలే దంపతులు ప్రజల పక్షాన పోరాటం చేశారని, హైదరాబాద్‌లో వారి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సావిత్రిబాయిఫూలే పేరును ఏదైనా వర్సిటీకి పెట్టే విషయమై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అణగారిన వర్గాలకు విద్యనందించిన మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని, క్యాబినెట్‌లో మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్లు తెలిపారు.
సావిత్రిబాయిఫూలే జయంతిని మహిళా దినోత్సంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఫూలే ఆశయసాధనకు బీసీలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. సావిత్రిబాయి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు చేయడంతో పాటు నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
Updated Date - Jan 04 , 2025 | 04:00 AM