Minister Seethakka: ఆదివాసీ సంప్రదాయ చీరకట్టులో మంత్రి సీతక్క
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:52 PM
మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీరకట్టుతో ఆకట్టుకున్నారు. గ్రీన్ కలర్ చీర కట్టుకుని చేతులకు, మెడకు కడియాలు పెట్టుకుని, గోలుసు వేసుకుని ఆదివాసీల సంప్రదాయాన్ని చాటారు.
Minister Seethakka: కొమురం భీం జిల్లా కెరమెరి మండలంలో జంగుబాయి జాతర ఘనంగా జరుగుతోంది. జాతరకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క సంప్రదాయ చీరకట్టుతో వచ్చారు. ఆదివాసీ గిరిజన మహిళలు ధరించే గోలుసు, చేతులకు, మెడకు కడియాలు వేసుకున్నారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే కొవ్వ లక్ష్మి కూడా ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని కాపాడుకోవాలని కోరారు.
Updated Date - Jan 14 , 2025 | 04:52 PM