Share News

అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:46 AM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు సాధించాలని ప్రభుత్వ విఫ్‌ బీర్ల అయిలయ్య, కలెక్టర్‌ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

భువనగిరి గంజ్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు సాధించాలని ప్రభుత్వ విఫ్‌ బీర్ల అయిలయ్య, కలెక్టర్‌ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జైభీమ్‌ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంతోనే స్వాతంత్య్రం తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో దే శం ముందుకు సాగుతోందన్నారు. ప్రాథమిక హక్కు లు, సూత్రాలను రాజ్యాంగంలో కల్పించి భారత రాజ్యాంగానికి సంపూర్ణ రూపం తీసుకొచ్చారని అన్నారు. అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించి, ఎన్నో అవమానాలకు గురై చదువు నేర్చుకొని ప్రపంచ మేధావిగా నిలిచారని అన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీల హక్కులు రూపొందించేందుకు కృషిచేశారన్నారు. అలాంటి ప్రపంచ మేధావి భారత దేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమన్నా రు. అంబేడ్కర్‌ ఆలోచనలు, ఆశయాలు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జై భీమ్‌ యాత్ర హైదా రాబాద్‌ చౌరస్తాలో ప్రారంభమై ఇంద్రనగర్‌, స్థంభం చౌరస్తా, ప్రిన్స్‌కార్నర్‌ మీదుగా పాత బస్టాండ్‌ వరకు కొనసాగింది. ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి యువతతో కలిసి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభరాణి, జిల్లా గ్రంఽథాలయ చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, అధికారులు మందడి ఉపేందర్‌రెడ్డి, వసంతకుమారి, రాజలింగం, శైలజ, నాయకులు బట్టు రాంచంద్రయ్య, బర్రె జహంగీర్‌, సురుపంగ శివలింగం, ఇటుకల దేవేందర్‌, బొల్లపల్లికుమార్‌, పోత్నాక్‌ ప్రమోద్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:46 AM