రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాక్షేత్రంలోకి
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:02 AM
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ నాయకురాలు బొజ్జ సంధ్యారెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి అర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

మండలాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం
డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి
యాదాద్రి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ నాయకురాలు బొజ్జ సంధ్యారెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి అర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తోందని, లౌకి క రాజ్యంలో భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జై బాపు, జైభీం, జైసంవిధాన్ అనే నినాదంతో ప్ర జల్లోకి వెళ్తున్నామన్నారు. అందుకు కోఆర్డినేటర్లను నియమించామని, వీరు గ్రామాల్లో పర్యటిస్తూ గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారన్నారు. వీరికి ప్రచార సామగ్రితో కూడిన కిట్‌లను పార్టీ అధిష్ఠానం పంపిణీ చేసిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు మండలానికి జక్క జంగారెడ్డి, మునిసిపాలిటీకి పిట్టల బాలరాజ్, బొమ్మలరామారానికి వెంకట్‌నాయక్, యాదగిరిగుట్టకు చుక్క స్వామి, మునిసిపాలిటీకి బింగి శ్రీనివాస్, రాజపేటకు విట్టల వెంకటేష్, ఆత్మకూరు(ఎం)కు గూడూరు నిఖిల్ రెడ్డి, గుండాలకు తోట శ్రీనివాస్, తుర్కపల్లికి కొండూరు సాయిని కోఆర్డినేటర్లు నియమించిన ట్టు తెలిపారు. అదేవిధంగా భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి మండలానికి గుండ్లపల్లి భరత్‌గౌడ్, మునిసిపాలిటీకి కవిత గౌడ్, బీబీనగర్‌కు సాగర్‌రెడ్డి, వలిగొండకు పి.నారాయణ, పోచంపల్లికి శ్రీనివాస్ కొరవి, మునిసిపాలిటీకి పెంటయ్యగౌడ్‌ను నియమించినట్టు తెలిపారు. సమావేశంలో నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, తంగళ్లపల్లి రవికుమార్, బాల్‌రాజు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, కూర వెంకటేష్, బర్రె జహంగీర్, మల్లేష్, పాల్గొన్నారు.