ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

OU Arts College: ఓయూలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి శవయాత్ర

ABN, Publish Date - Mar 14 , 2025 | 05:16 AM

ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో గురువారం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి శవయాత్ర నిర్వహించారు.

  • దళితులకు క్షమాపణ చెప్పాలని విద్యార్థి నాయకుల డిమాండ్‌

ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో గురువారం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి శవయాత్ర నిర్వహించారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఓయూ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ స్పీకర్‌గా దళితుడు ఉండడాన్ని జగదీశ్‌రెడ్డి సహించలేకపోతున్నారని దుయ్యబట్టారు. దళిత సమాజానికి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఎక్కడికక్కడ ఆయన్ను అడ్డుకొంటామని, ప్రత్యక్ష దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 05:16 AM