Share News

6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:02 AM

రాష్ట్రంలో గడిచిన ఆరు రోజుల్లో 1.27 కోట్ల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.

6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

  • 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడిచిన ఆరు రోజుల్లో 1.27 కోట్ల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 90.42 లక్షల రేషన్‌ కార్డులుండగా.. ఇప్పటివరకు ఏప్రిల్‌ కోటా కింద 42 లక్షల రేషన్‌ కార్డులపై పేదలు బియ్యం తీసుకున్నారు. ప్రతి నెలా లబ్ధిదారులు సగటున 16 లక్షల క్వింటా ళ్ల బియ్యం రేషన్‌ షాపులనుంచి తీసుకుంటుండగా... ఈ నెలలో ఆరు రోజుల వ్యవధిలో 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,311 రేషన్‌ షాపులుండగా.. 8,899 షాపుల్లో సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది.


కొన్ని జిల్లాలకు బియ్యం రవాణా పూర్తిస్థాయిలో జరగకపోవటం, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు వస్తుండటం, మరికొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల రాక కోసం ఎదురుచూస్తుండటంతో.. బియ్యం పంపిణీ మందకొడిగా సాగుతోంది. గోదాము ల నుంచి రేషన్‌షాపులకు బియ్యం రవాణా దాదాపుగా పూర్తయిందని, ఈ వారంలో బియ్యం సరఫరా మరింత మెరుగుపడుతుందని, 15 తేదీ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Apr 07 , 2025 | 05:02 AM