Ponguleti: వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ABN, Publish Date - Mar 08 , 2025 | 03:35 AM
మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

బీఆర్‌ఎస్ ఆర్థిక అరాచకం వల్లే ‘తులం బంగారం’ ఆలస్యం రెవెన్యూ మంత్రి పొంగులేటి
కూసుమంచి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం, ఆర్థిక అరాచకం వల్లే తాము పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉందని, అందుకే కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం వంటి వాటి అమలు ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 08 , 2025 | 09:05 AM