ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: బీఆర్‌ఎస్‌లో బీసీలకు గొంతెత్తే ధైర్యం ఉందా?

ABN, Publish Date - Jan 04 , 2025 | 04:23 AM

‘‘కాంగ్రెస్‌ పార్టీలో బీసీల సమస్యలపై గొంతెత్తే స్వేచ్ఛ పార్టీలోని బీసీ నేతలందరికీ ఉంది. బీఆర్‌ఎస్‌ లోని బీసీ నేతలకు బీసీల గురించి గొంతెత్తే ధైర్యం ఉందా?’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ పార్టీలో బీసీల సమస్యలపై గొంతెత్తే స్వేచ్ఛ పార్టీలోని బీసీ నేతలందరికీ ఉంది. బీఆర్‌ఎస్‌ లోని బీసీ నేతలకు బీసీల గురించి గొంతెత్తే ధైర్యం ఉందా?’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. బతుకమ్మ, జాగృతి.. ఇప్పుడు బీసీలు అంటూ ఏదో ఒక అజెండా పట్టుకుని మార్కెట్లో ఉండడం తప్ప పదేళ్లలో ఏనాడైనా బీసీల గురించి కవిత మాట్లాడారా అని ఆయన నిలదీశారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, మత్స్య కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌లతో కలిసి పొన్నం మాట్లాడారు. బీసీలకు పార్టీలోనూ సంస్థాగతంగా న్యాయం చేయని బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తగ్గించినప్పుడు ఎమ్మెల్సీ కవిత గొంతు ఎక్కడికి పోయిందని నిలదీశారు. కులగణన సర్వే పూర్తయ్యాక దాన్ని ప్రజల అందుబాటులో పెడతామని, నిపుణులతోనూ చర్చిస్తామని చెప్పారు. కాగా పదేళ్ల పాలనలో బీసీలను విస్మరించిన ఘనత బీఆర్‌ఎ్‌సదని, అలాంటిది బీసీల కోసం ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎ్‌సకు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా బీసీని ప్రకటించాలని శుక్రవారం ఓ ప్రకటనలో సవాల్‌ చేశారు.

Updated Date - Jan 04 , 2025 | 04:23 AM