Kasturba Gandhi Girls School: నిద్రిస్తున్న విద్యార్థినులను కొరికిన ఎలుకలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:08 AM
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరకడం కలకలం రేపింది. ఉగాది పండుగ తరువాత తీపి పదార్థాలను తినే క్రమంలో ఎలుకలు బాలికల కాళ్లను కరిచి, 10 మంది గాయపడ్డారు.

కొందుర్గు కస్తూర్బా బడిలో 10 మందికి గాయాలు
చౌదరిగూడ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరకడం కలకలం రేపింది. ఉగాది పండుగకు వెళ్లి వచ్చిన బాలికలు ఇంటి దగ్గరి నుంచి భక్ష్యాలను తెచ్చుకున్నారు. సోమవారం రాత్రి వాటిని తినే క్రమంలో పిండి వంటల ముక్కలు, బెల్లం, చక్కెర కిందపడ్డాయి. వాటిని విద్యార్థినులు తొక్కడం వల్ల కాళ్లకు అంటుకున్నాయి. అనంతరం బాలికలు కాళ్లు కడుక్కోకుండానే నిద్రపోయారు. తీపి పదార్థాల వాసన రావడంతో గదిలోకి వచ్చిన ఎలుకలు.. విద్యార్థినుల కాళ్లను కరిచాయి. దీంతో 10 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పాఠశాల ప్రత్యేకాధికారి నిస్సీ మంగళవారం ఉదయం బాలికలను కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. అనంతరం షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జయలక్ష్మి విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి టీటీ, యాంటీ రెబీస్ ఇంజెక్షన్లు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News