అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే హక్కులు, పదవులు
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:33 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో నే సమాజంలో హక్కులు, పదవులు, బాధ్యత లు లభిస్తున్నాయని కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ అన్నారు.

సూర్యాపేటటౌన్, ఏప్రిల్ 14‘(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో నే సమాజంలో హక్కులు, పదవులు, బాధ్యత లు లభిస్తున్నాయని కలెక్టర్ తేజ్‌సనందలాల్‌పవార్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భం గా జిల్లాకేంద్రంలోని ఖమ్మంక్రాస్ రోడ్డు అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు జగదీ్‌షరెడ్డి, మం దుల సామేల్, ఎస్పీ నర్సింహలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న అంబేడ్కర్ ఎలాంటి పక్షపా తం లేకుండా రాజ్యాంగాన్ని రచించారన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎటువైపు చూసినా అంబేడ్కర్ మార్క్ కనిపిస్తోందన్నారు. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ మే దేశానికి శ్రీరామరక్షని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని బీఆర్‌ఎస్ హ యాంలో నిర్మించామని గుర్తుచేశారు. తుంగతు ర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో ప్రతి ఒక్కరి కీ న్యాయం జరుగుతుందన్నారు. ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ అంబేడ్కర్ బడుగుబలహీన వర్గా ల అభివృద్ధికి ఎనలేని కృషిచేశారన్నారు. ఎలాం టి అవకాశాలు లేని సమయంలో ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, డీటీడీ వో శంకర్,డీఎంహెచ్‌వో కోటాచలం, డీఆర్‌డీ వో పీడీ అప్పారావు,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివా్‌స, టీఎన్‌జీవో సెక్రెటరీ దున్నశ్యాం పాల్గొన్నారు.
దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేడ్కర్.
సూర్యాపేటక్రైం: భారత రాజ్యాంగాన్ని రచిం చి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సంధర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. జాతి కోసం అంకితమై బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, అంటరానితనం నిర్మూళన కోసం ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మేక నాగేశ్వర్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నర్సింహాచారి, ఎస్‌బీఐ నాగభూషణరావు, ఆర్‌ఐ నర్సింహ, డీసీఆర్‌బీ సీఐ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.