Share News

Secunderabad Railway: 10 రైళ్లకు టెర్మినళ్ల మార్పు

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:35 AM

ఆయా రైళ్లు సదరు రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఆ రైళ్లు వెళ్లే మార్గాల్లో వాటి స్టాపేజీలు యధాతథంగా ఉంటాయని ఎస్‌సీఆర్‌ సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Secunderabad Railway: 10 రైళ్లకు టెర్మినళ్ల మార్పు

  • సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులతో ఎస్‌సీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌సిటీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే మరో 10 రైళ్లను తాత్కాలిక ఏర్పాట్లలో భాగం గా ప్రత్యామ్నాయ రైల్వేస్టేషన్లకు మళ్లిస్తున్నట్లు పేర్కొంది. అందులో భాగంగా చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్‌, మల్కాజిగిరి రైల్వేస్టేషన్లకు తరలిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు సదరు రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఆ రైళ్లు వెళ్లే మార్గాల్లో వాటి స్టాపేజీలు యధాతథంగా ఉంటాయని ఎస్‌సీఆర్‌ సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


చర్లపల్లి-దానాపూర్‌ మధ్య 26 ప్రత్యేక రైళ్లు

వేసవిసెలవుల్లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-దానాపూర్‌ మధ్య ఈ నెల మొదటి వారం నుంచి జూన్‌ చివరి వారం వరకు 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) గురువారం తెలిపింది. ఈ నెల 3 నుంచి జూన్‌ 29 వరకు దానాపూర్‌-చర్లపల్లి- దానాపూర్‌ (03225-03226) రైలు 26 సార్లు నడుస్తుందని పేర్కొంది. ఈరైళ్లు ఆరా, బుక్సర్‌, పండిట్‌ డిడి ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్‌ ఛెకి, మణిక్‌పూర్‌, సత్న, జబల్‌సూర్‌, ఇటార్సి, నాగ్‌పూర్‌, బల్లార్షా, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి.

Updated Date - Apr 04 , 2025 | 05:35 AM