Fibernet: ఇంటింటికీ ఫైబర్‌నెట్‌కు ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:27 AM
ఇంటింటికీ ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీ-ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం హజీపల్లి గ్రామంలో ఫైబర్‌నెట్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.

టీ-ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ వెల్లడి
హాజీపల్లిలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీ-ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం హజీపల్లి గ్రామంలో ఫైబర్‌నెట్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నామని ఆయన తెలిపారు.
దీనికి సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్టు అమలుకు హజీపల్లిని ఎంపిక చేసి, వెంటనే కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారని చెప్పా రు. గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి ఇంటికీ ఫైబర్‌నెట్ సేవలు అందుతాయని, తద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంద ని తెలిపారు. గ్రామంలో 274 ఇళ్లు ఉన్నాయని, ప్రస్తుతం 80 ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చామని, మిగతా ఇళ్లకు త్వరలో ఇస్తామని వివరించారు.