Nerella Sharada: లివింగ్ రిలేషన్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి.. మహిళలపై ట్రోలింగ్ చేస్తే..: మహిళా కమిషన్ ఛైర్మన్

ABN, Publish Date - Mar 08 , 2025 | 07:14 PM

ఉమెన్స్ డే సందర్భంగా ట్రోలర్స్‌కు మహిళా కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్ట్‌లు మహిళలను ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప కించపరిచేలా ఉండకూదని సూచించారు. మీ ఇంట్లో ఆడవారిలానే, బయట మహిళను కూడా గౌరవించాలని హితవు పలికారు.

Nerella Sharada: లివింగ్ రిలేషన్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి.. మహిళలపై ట్రోలింగ్ చేస్తే..: మహిళా కమిషన్ ఛైర్మన్
Nerella Sharada

చేతిలో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు మహిళల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద హెచ్చరించారు. ఉమెన్స్ డే సందర్భంగా ట్రోలర్స్‌కు మహిళా కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్ట్‌లు మహిళలను ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప, కించపరిచేలా ఉండకూదని సూచించారు. మీ ఇంట్లో ఆడవారిలానే, బయట మహిళలను కూడా గౌరవించాలని హితవు పలికారు.


తాను ఛార్జ్ తీసుకున్న వారానికే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చానని, అయితే వాటిని ఎవరూ పాటించడం లేదని, అలాంటి వారిని ఇక ఉపేక్షించబోమని నేరెళ్ల శారద తెలిపారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో శృతి మించి పోస్ట్‌లు పెడితే చర్యలు తప్పవని, మహిళల రక్షణ కోసం రానున్న రోజుల్లో పటిష్టమైన చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు సహకరిస్తేనే మహిళలు మరింతగా రాణిస్తారని, మహిళలను ఎలా గౌరవించాలి అనే దానిపై మహిళ కమిషన్ తరపున అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే హాస్టళ్లలో యువతుల ఆత్మహత్యలు, వసతులు, స్పై కెమెరాలు, ఇతర అంశాలపై దృష్టి పెట్టామన్నారు.


మహిళ కమిషన్ మాత్రమే కాదు, అందరూ హాస్టళ్ల వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. మహిళలకు ఎలాంటి సమస్య ఉన్నా, ఏ సమయంలోనైనా కమిషన్‌కు కాల్ చేస్తే స్పందిస్తామని తెలిపారు. అలాగే ఈ ఏడు నెలల కాలంలో లివింగ్ రిలేషన్ సంబంధించిన కేసులు ఎక్కువగా కమిషన్ దృష్టికి వస్తున్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, డొమెస్టిక్ వయిలెన్స్ కేసుల విషయంలో కూడా కఠినంగా నిబంధనలను అమలు చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 07:14 PM