Parking Facilities: సచివాలయంలో పార్కింగ్‌ సదుపాయం!

ABN, Publish Date - Feb 10 , 2025 | 04:23 AM

రాష్ట్ర సచివాలయంలో వాహనాల పార్కింగ్‌ సదుపాయంతో పాటు డ్రైవర్ల సమస్యలు తీరనున్నాయి. డ్రైవర్ల కోసం రెస్ట్‌రూమ్స్‌, టాయ్‌లెట్స్‌ మరికొన్ని సౌకర్యాల కల్పనకు రంగం సిద్ధమైంది.

Parking Facilities: సచివాలయంలో పార్కింగ్‌ సదుపాయం!
  • గ్రౌండ్‌ ఫ్లస్‌ వన్‌, సోలార్‌ రూఫ్‌ టాప్‌ నిర్మాణం.. అంచనా వ్యయం 26.81కోట్లు

  • ఎలక్ర్టిక్‌ వాహనాలకు చార్జింగ్‌ పాయింట్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో వాహనాల పార్కింగ్‌ సదుపాయంతో పాటు డ్రైవర్ల సమస్యలు తీరనున్నాయి. డ్రైవర్ల కోసం రెస్ట్‌రూమ్స్‌, టాయ్‌లెట్స్‌ మరికొన్ని సౌకర్యాల కల్పనకు రంగం సిద్ధమైంది. వీటి నిర్మాణాలకు రూ.26.81 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. సచివాలయంలో వాహనాల పార్కింగ్‌కు సరైన సదుపాయాలు లేవు. దీంతో సచివాలయానికి వచ్చిన సందర్శకులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలపై దృష్టిసారించిన రోడ్లు, భవనాల శాఖ వాహనాల పార్కింగ్‌ సౌకర్యం కోసం రెండు, మూడు రకాల నమూనాలను రూపొందించింది. వీటిలో గ్రౌండ్‌ ఫ్లస్‌ వన్‌ విధానంలో ఒకటి, సోలార్‌ రూఫ్‌టాప్‌ పద్ధతిలో రెండోది, మూడోది సాధారణ షెడ్డులాగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ విధానంలోనే నిర్మాణం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సచివాలయం ప్రధాన ద్వారం మినహా మిగిలిన మూడు వైపులా ఈ పార్కింగ్‌ సౌకర్యాన్ని ఏర్పాటుచేయనున్నారు. వీటిలో గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ విధానంలోనే నిర్మించినా సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తారని తెలిసింది. కొత్తగా ఏర్పాటుచేయబోయే పార్కింగ్‌ విధానంలో ఎలక్ర్టిక్‌ వాహనాల ఛార్జింగ్‌కు అవకాశం కల్పించనున్నట్టు తెలిసింది. ఇందుకోసం రెడ్‌కో విభాగంతో ఆర్‌ అండ్‌ బీ శాఖ చర్చించనుంది. త్వరితగతిన పార్కింగ్‌ సౌకర్యాల కల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారని తెలిసింది.


సోలార్‌ విద్యుత్‌తో ఆదాయం కూడా

పార్కింగ్‌ సౌకర్యాన్ని సోలార్‌ విధానంలో నిర్మిస్తే కొంత విద్యుత్‌ బిల్లు ఆదా చేయోచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయం శోభాయమానంగా కనబడాలని రాత్రి సమయంలో భారీ లైట్లు ఆన్‌లో ఉంటున్నాయి. దీంతో విద్యుత్‌ బిల్లు అఽధికంగా వస్తోంది. ఇదే సమయంలో మరికొన్ని అవసరాలకు వినియోగించుకునేందుకు సోలార్‌ విద్యుత్‌ ఉపయోగపడుతుంది. దీంతో సోలార్‌ రూఫ్‌ పార్కింగ్‌ విధానమైతే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు, అధికారులను కలిసేందుకు వచ్చే సందర్శకులు సచివాలయం లోపలికి వెళ్లాలంటే ఇబ్బందిపడాల్సి వస్తోంది. పాసులు జారీ చేసే కౌంటర్‌ నుంచి సచివాలయంలోకి వెళ్లాలంటే చాలా దూరం ఉంది. ఈ నేపథ్యంలో పాసులు జారీ చేసే కౌంటర్‌ ఎదురుగానే సచివాలయంలోనికి నడిచి వెళ్లేలా మార్గం ఏర్పాటుచేయ డంతోపాటు వృద్ధులు, వికలాంగులు వెళ్లేందుకు వీలుగా విద్యుత్‌ వాహనాలను ఏర్పాటుచేస్తే బా గుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 04:23 AM