జూన్ 1 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు
ABN, Publish Date - Apr 03 , 2025 | 04:43 AM
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి(టీజీబీఐఈ) జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.
సెలవుల్లో అనధికారికంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు
రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృష్ణ ఆదిత్య
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి(టీజీబీఐఈ) జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 2న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని, రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు కచ్చితంగా సెలవుల షెడ్యూల్‌ను పాటించాలని టీజీబీఐఈ కార్యదర్శి కృష్ణ ఆదిత్య బుధవారం ఓ ప్రకటనలో ఆదేశించారు. సెలవుల్లో అనధికారకంగా తరగతులు నిర్వహిస్తే ఆ విద్యా సంస్థల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Updated Date - Apr 03 , 2025 | 04:43 AM