Share News

జీవో 21 ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:11 AM

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల విధివిధానాలపై తీసుకొచ్చిన జీవో 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్‌ ఆసిస్టెంట్‌ ప్రొఫెసర్ల జేఏసీ డిమాండ్‌ చేసింది.

జీవో 21 ఉపసంహరించుకోవాలి

  • వర్సిటీల్లో కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

  • విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్‌ ఆసిస్టెంట్‌ ప్రొఫెసర్ల జేఏసీ

పంజాగుట్ట, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల విధివిధానాలపై తీసుకొచ్చిన జీవో 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్‌ ఆసిస్టెంట్‌ ప్రొఫెసర్ల జేఏసీ డిమాండ్‌ చేసింది. 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని, యూజీసీ పే ేస్కల్స్‌ వర్తింప చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని జేఏసీ నాయకులు కోరారు.


సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ ధర్మతేజ, సమన్వయకర్త డాక్టర్‌ ఉపేందర్‌ రావు, డాక్టర్‌ పరశురామ్‌, డాక్టర్‌ వేల్పుల కుమార్‌, డాక్టర్‌ కనకయ్య తదితరులు మాట్లాడారు. 12 విశ్వవిద్యాలయాల్లో 1270 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులుగా కొనసాగుతున్నారని, తమను క్రమబద్ధీకరించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. 10 రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే వీసీల ఇల్లు ముట్టడిస్తామని, నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

Updated Date - Apr 08 , 2025 | 04:11 AM