KCR: కేసీఆర్ సొంత మీడియాకే 348.43 కోట్లు!
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:43 AM
గత ప్రభుత్వ పాలన సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన మీడియా సంస్థలకు అడ్డగోలుగా ప్రభు త్వ ప్రకటనలను జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

2014 నుంచి 2023 దాకా ప్రభుత్వ ప్రకటనల్లో అగ్రభాగం వాటికేనన్న రాష్ట్ర ప్రభుత్వం
2016లో నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ 8,94,626.. 2019లో 3,26,654కే పరిమితం
సీఏ ధ్రువీకరించిన పత్రాలతో అడ్డగోలు టారి్‌ఫలు నిర్ణయించారనే భావన
నిబంధనలను ఉల్లంఘించి రేటు పెంచుకున్నారంటున్న ప్రభుత్వ వర్గాలు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ పాలన సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన మీడియా సంస్థలకు అడ్డగోలుగా ప్రభు త్వ ప్రకటనలను జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వారి ప్రచురణ, ప్రసార మాధ్యమాలకు 2014 నుంచి 2023 మధ్య ఏకంగా రూ.348.43 కోట్ల ప్రకటనలు ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో నమస్తే తెలంగాణకు రూ.182 కోట్లు, తెలంగాణ టుడేకు రూ.150 కోట్లు, టీ న్యూస్ చానల్‌కు రూ.16.43 కోట్లు ఉన్నట్టు వెల్లడించాయి. పత్రికల సర్క్యులేషన్‌తో సంబంధం లేకుండా టారి్‌ఫలను పెంచి, నిధులు చెల్లించారని ఆరోపించాయి.
లెక్కలన్నీ తీస్తామన్న లెక్కతో..
కేసీఆర్‌కు చెందిన ప్రచురణ, ప్రసార మాధ్యమాలకు గత పదేళ్లలో ఏమేరకు ప్రకటన లు ఇచ్చారో లెక్కలన్నీ తీస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఇటీవలి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాలు వివరాలను బయటపెట్టాయి. ‘‘2011 జూన్ 6న నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభం కాగా.. 2012 జూన్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పత్రికకు ప్రతి చదరపు సెంటీమీటర్‌కు రూ.875 టారి్‌ఫతో ప్రకటనలకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఆ పత్రికకు 4,90,423 సర్క్యులేషన్ ఉందని చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంది. తర్వాత 2016లో జీవో నం.84 ద్వారా వివిధ పత్రికల ప్రకటనల రేటును బీఆర్‌ఎస్ ప్రభుత్వం సవరించింది. అప్పట్లో నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ 8,94,626 కాపీలుగా సీఏ ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుని టారిఫ్ రేటును రూ.1,250కు పెంచింది. మళ్లీ 2019 జనవరి 10న రేట్లను సవరించింది. ఈసారి నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ 3,26,654గా (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్-ఏబీసీ ప్రకారం) తేల్చి టారి్‌ఫను రూ.1,500కు పెంచింది..’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన కాలంలో సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా రూ.71.79 కోట్లు, ఇతర శాఖల ద్వారా రూ.57.97 కోట్లు, భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా రూ.51.73 కోట్లు కలిపి రూ.182 కోట్లు నమస్తే తెలంగాణకు ప్రకటనల కోసం ప్రభుత్వం వెచ్చించిందని వెల్లడించాయి.
మిగతా సంస్థలకు కూడా..
ఒక పత్రికకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వాలంటే కనీసం 18 నెలల పాటు ఆ పత్రిక ప్రచురణలు వెలువడాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ 2016 డిసెంబరు 15న ప్రారంభమైన తెలంగాణ టుడే పత్రికకు మూడు నెలలకే 2017 మార్చి 14న జీవో నం.682 ద్వారా ప్రకటనలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని వివరించాయి. ‘‘ప్రారంభంలో తెలంగాణ టుడే పత్రిక సర్క్యులేషన్ 1,49,245గా ఉందన్న సీఏ ధ్రువపత్రం ఆధారంగా టారి్‌ఫను రూ.1000గా నిర్ణయించారు. తర్వాత రెండేళ్లకే 2019 జనవరి 10న రూ.2000కు పెంచారు. తెలంగాణ టుడేకు 2019 నుంచి 2023 మధ్య రూ.150 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. టీ న్యూస్ చానల్‌కు కూడా రూ.16.43 కోట్ల ప్రకటనలు ఇచ్చారు’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిబంధనలను ఉల్లంఘించి సొంత మీడియాకు ప్రకటనలు ఇచ్చుకున్నారని ప్రభుత్వం భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఆ సమయంలో సీఎం కేసీఆర్ చేతుల్లోనే సమాచార శాఖ కూడా ఉందని గుర్తుచేశాయి. మొత్తంగా పదేళ్లలో ప్రభుత్వ ప్రకటనల కోసం 1,757 కోట్లను వెచ్చించగా.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల మీడియా సంస్థలకే 38.4 శాతం నిధులు మళ్లించినట్లు తేలిందని వెల్లడించాయి. ఆ సంస్థల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా పనిచేశారని వవరించాయి.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News