ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

QR Code: స్కాన్‌ చేయండి.. అభిప్రాయం చెప్పండి

ABN, Publish Date - Jan 10 , 2025 | 04:44 AM

పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీ్‌సశాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు?

  • పౌరుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం పోలీస్‌శాఖ కొత్త ప్రయత్నం

  • ప్రతి స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌

  • ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా పోలీస్‌ స్టేషన్లకు ర్యాంకులు

  • స్కాన్‌ చేసి ఫిర్యాదు చేసేందుకు వెసులుబాటు

  • క్యూఆర్‌ కోడ్‌ లాంచ్‌ చేసిన డీజీపీ జితేందర్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీ్‌సశాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్‌ స్టేషన్లలో ప్రజలకు సరైన ఆదరణ లభిస్తోందా? ఫిర్యాదుదారులతో సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఓ క్యూఆర్‌ కోడ్‌ను రూపొందించారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ను డీజీపీ జితేందర్‌ తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు క్యూఆర్‌ కోడ్‌ను తయారుచేశామని తెలిపారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ తెలంగాణలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో, ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద, సోషల్‌ మీడియా, పోలీస్‌ వెబ్‌సైట్లల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు.


క్యూఆర్‌ కోడ్‌ను ప్రజలు స్కాన్‌ చేస్తే ఇంగ్లిషు, తెలుగులో పేజీ తెరచుకుంటుందని, అందులో పోలీసుల గురించి ప్రశ్నలు ఉంటాయని వాటికి సమాధానాలు టైప్‌ చేసి పంపాలని లేదా వాయిస్‌ ద్వారా అయినా సమాధానం ఇవ్వవచ్చని డీజీపీ జితేందర్‌ తెలిపారు. అదే విధంగా ఎఫ్‌ఐఆర్‌ గురించి, ఈ చలాన్‌(ట్రాఫిక్‌ ఉల్లంఘనలు), పాస్‌పోర్టు ధ్రువీకరణ, ఇతర అంశాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుత పోలీస్‌ సేవలపై ప్రజల అభిప్రాయాలు విశ్లేషించి వాటి ఆధారంగా సేవల ప్రమాణాలు మెరుగుపర్చనున్నామన్నారు. తద్వారా పోలీస్‌ శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఆయా పోలీస్‌ స్టేషన్ల పనితీరుపై ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. ఈ క్యూఆర్‌ కోడ్‌.. సీఐడీ విభాగం డీజీ షికాగోయల్‌ ఆధ్వర్యంలో రూపొందింది.

Updated Date - Jan 10 , 2025 | 04:44 AM