ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: ఎస్‌హెచ్‌జీలకు సౌర విద్యుత్తు ప్లాంట్లు.. త్వరలో టెండర్ల ఖరారు

ABN, Publish Date - Jan 09 , 2025 | 05:09 AM

మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ప్లాంట్ల టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

  • భవంతులపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ప్లాంట్ల టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీల ద్వారా విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా మొదటి దశలో 1000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని, దీనికి సంబంధించి ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ పథకంపై బుధవారం ప్రజాభవన్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఈ సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ప్లాంట్ల కోసం రుణాల విషయంలో బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలన్నారు. ఇప్పటికే ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ(టీజీ రెడ్‌కో) టెండర్లను ఆహ్వానించిందని, త్వరలో వీటిని ఖరారు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని భారీ భవంతులపై సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ‘పీఎం కుసుమ్‌’ పథకంలో భాగంగా రైతులు 2 మెగావాట్ల వరకు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశముందని, ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీని కోసం టీజీ రెడ్‌కో పోర్టల్‌ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని డిప్యూటీ సీఎం సూచించారు.

Updated Date - Jan 09 , 2025 | 05:09 AM