Tummla: వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళిక అవసరం: తుమ్మల
ABN, Publish Date - Mar 21 , 2025 | 03:41 AM
కేంద్ర ప్రభుత్వం, జర్మనీ ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కొత్త ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం, జర్మనీ ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కొత్త ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో పైలట్ ప్రాతిపదికన హెచ్‌హెచ్‌ఐ, జర్మనీ సంస్థ సహకారంతో చేపడుతున్న పరిశోధనల్లో భాగంగా... 3 ఆహారశుద్ధి యూనిట్ల నుంచి 55 మంది రైతులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో గురువారం జర్మన్ ప్రతినిధులతో నిర్మహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధి, కూలీల ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు, డ్రోన్లతో నేలసారాన్ని పరీక్షించటం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. జర్మనీ ప్రభుత్వంతో కలిసి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, అగ్రి-హబ్ అధికారులకు సూచించారు. తెలంగాణ రైతులను జర్మనీ పంపించి శిక్షణ ఇప్పించాల్సి ఉందని అన్నారు.
Updated Date - Mar 21 , 2025 | 03:41 AM