Vijaya Dairy: ‘విజయ’ పాల సేకరణ ధరల సవరణ
ABN, Publish Date - Apr 05 , 2025 | 04:36 AM
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(విజయ డెయిరీ) పాల సేకరణ ధరలు సవరించింది. పాలల్లో ఉన్న వెన్న శాతం ఆధారంగా ధరలు నిర్ణయించింది.

గేదె పాలు ధర రూ. 85.. ఆవు పాల ధర రూ. 41.60
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(విజయ డెయిరీ) పాల సేకరణ ధరలు సవరించింది. పాలల్లో ఉన్న వెన్న శాతం ఆధారంగా ధరలు నిర్ణయించింది. గేదె పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 5 చొప్పున ధర పెంచింది. ఈ పెంపుతో 10 శాతం వెన్న ఉండే గేదె పాల ధర లీటరకు రూ. 80 ఉండగా.. ఇకమీదట రైతులకు రూ. 85 చెల్లించనున్నారు. 5 శాతం వెన్న ఉండే పాలకు లీటరుకు రూ. 42.50 పైసలు చెల్లించాలని డెయిరీ నిర్ణయించింది.
గేదె పాల ఉత్పత్తి, సేకరణ దిశగా రైతులను మరింత ప్రోత్సహించేందుకే ధరలు పెంచినట్లు డెయిరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ తెలిపారు. మరోవైపు ఆవు పాల ధరలను తగ్గించారు. 3 శాతం వెన్న ఉన్న ఆవు పాలకు లీటరుకు రూ. 37 చొప్పున, 4.5 శాతం వెన్న ఉన్న పాలకు లీటరుకు రూ. 41.60 పైసల చొప్పున రైతులకు చెల్లించనున్నారు. సవరించిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయని, ప్రతి మూడు నెలలకోసారి పాల సేకరణ ధరలు సమీక్షించాలని నిర్ణయించామని విజయ డెయిరీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 05 , 2025 | 04:36 AM