Minister Ponguleti: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు: మంత్రి పొంగులేటి..
ABN, Publish Date - Jan 06 , 2025 | 04:52 PM
వరంగల్ రీజియన్‌కు తెలంగాణ ఆర్టీసీ కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవాళ(సోమవారం) 50 బస్సులను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు.
వరంగల్: ఓరుగల్లును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలో భద్రకాళి ట్యాంక్ బండ్, టెక్స్ టైల్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి వెల్లడించారు. వరంగల్ రీజియన్‌కు తెలంగాణ ఆర్టీసీ కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవాళ(సోమవారం) 50 బస్సులను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు. మరో 25 బస్సులను సంక్రాంతి లోపు, మిగతా వాటిని ఆ తర్వాత ప్రారంభిస్తామని పొంగులేటి తెలిపారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముగ్గురు మంత్రులూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. "పర్యావరణానికి హాని కలగకుండా తెలంగాణ ఆర్టీసీని అప్డేట్ చేస్తున్నాం. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నాం. హైదరాబాద్‌కు ఏ టెక్నాలజీ వచ్చినా వెంటనే దాన్ని వరంగల్‌కూ తెస్తాం. ఉమ్మడి ఏపీలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. 4.5 లక్షల గృహాలను ఇప్పుడు మొదటి విడతలో ఇస్తాం. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తాం. అన్ని మండలాల్లో మోడల్ ఇందిరమ్మ గృహాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేస్తాం. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించాం. 80 లక్షల మంది ఇందిరమ్మ గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని స్క్రూటినీ చేసి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులకు అందిస్తాం. దరఖాస్తు చేసుకోని వారు భయపడాల్సిన పనిలేదు. ఇందిరమ్మ గృహాలు అనేది నిరంతర ప్రక్రియ, అర్హులకు తప్పకుండా ఇస్తాం. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి అందిస్తాం.
రైతు భరోసాపై వేలాది మంది రైతుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎకరానికి రూ.12 వేలు చొప్పున రైతు భరోసా కింద ఇవ్వాలని నిర్ణయించాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం. జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు అందిస్తాం. భూమిలేని అర్హులైన పేదలకు ఏటా రూ.12వేలు ఇస్తాం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఒకవేళ 200 ఎకరాలు సాగు చేస్తే ఆయనకూ రైతు భరోసా ఇస్తాం. 25 లక్షల మంది అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. సన్న వడ్లు పండించిన రైతన్నలకు రూ.500 బోనస్ ఇచ్చాం. గత ప్రభుత్వం పదేళ్లలో మర్చిపోయిన రేషన్ కార్డులను మేము ఇవ్వబోతున్నాం. ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో ఏం కోరుకున్నారో అవన్నీ నెరవేరుతాయి. పేదోడి సొమ్ము విదేశాలకు పంపించిన అక్రమార్కుడిపై చట్టప్రకారం కేసులు పెడితే ప్రతిపక్షాలు రౌడీళ్లా ప్రవర్తిస్తున్నాయి. ప్రతిపక్షాల చిల్లర మాటలకు మా అభివృద్ధి పనులే సమాధానం చెప్తాయని" అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Delhi: మోహన్ బాబు కేసు విచారణలో ట్విస్ట్.. ఆ రోజు విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు..
Hyderabad: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. పర్మిషన్ తీసుకోవాల్సిందే..
Updated Date - Jan 06 , 2025 | 04:53 PM