Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:00 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరొకరు బలయ్యారు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి
  • బెట్టింగ్‌లో రూ.5లక్షలు పోగొట్టుకోవడంతో ఆత్మహత్య

మోపాల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరొకరు బలయ్యారు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్‌ జిల్లా రూరల్‌ మండలంలోని ఆకుల కొండూర్‌ గ్రామానికి చెందిన ఆకాష్‌ (22) మండలంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి ఇటీవల రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని భయపడి మార్చి 26న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.


గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆకా్‌షకు భార్య, ఆరు నెలల బాబు ఉన్నాడు.

Updated Date - Apr 03 , 2025 | 04:00 AM