బ్రో అన్నాడని డెలివరీ బాయ్‌పై దాడి

ABN, Publish Date - Mar 26 , 2025 | 04:44 PM

Delivery Boy Assaulted: విశాఖలో డెలివరీ బాయ్‌పై ఓ వ్యక్తి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. బ్రో అని పిలిచాడంటూ డెలివరీ బాయ్‌పై ప్రసాద్‌ అనే వ్యక్తి దాడి చేశాడు.

విశాఖపట్నం, మార్చి 26: నగరంలో ఓ డెలివరీ బాయ్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీతమ్మ ధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్విగ్గి డెలివరీ బాయ్ అనిల్ ఆర్డర్ డెలివరీ కోసం ప్రసాద్ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడిని బ్రో అని పిలవడంతో ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నన్ను సార్ అని పిలవాలి. బ్రో అని కాదు’ అంటూ అనిల్‌పై దాడి చేశాడు. అంతే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అనిల్‌ను కొట్టి అతడి బట్టలు చించి గేటు వద్ద నిలబెట్టి క్షమాపణ లేఖ రాయాలని బలవంతం చేశాడని పోలీసులు తెలిపారు.


ఈ దాడిపై డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. దాడిపై విశాఖలో డెలివరీ వర్కర్లు నిరసనలు చేపట్టారు. డెలివరీ సిబ్బంది భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డెలివరీ బాయ్‌ను ప్రసాద్ కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి...

Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:44 PM