దంచికొట్టిన వడగళ్ల వాన..

ABN, Publish Date - Apr 15 , 2025 | 09:03 PM

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాబ్ పేట, హన్వాడ మండలాల్లో వర్షం దంచికొట్టింది.

మహబూబ్ నగర్: తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాబ్ పేట, హన్వాడ మండలాల్లో వర్షం దంచికొట్టింది. భారీఎత్తున ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, అరటి పంటలు దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. పంట చేతికి రావడంతో అన్నదాతలు వరి ధాన్యాన్ని కళ్లాలు, రోడ్లపై ఆరబోశారు. ఒక్కసారిగా వర్షం కావడంతో ధాన్యం పూర్తిగా తడిచిపోయి తీవ్రం నష్టం వాటిల్లింది. మరోవైపు గాలివానకు అరటిచెట్లు పూర్తిగా నెలకొరిగాయి. లక్షలు పెట్టి సాగు చేస్తే చివరికి నష్టపోయే పరిస్థితి వచ్చిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated at - Apr 15 , 2025 | 09:04 PM