రైతులకు ప్రభుత్వం శుభవార్త...

ABN, Publish Date - Feb 28 , 2025 | 11:19 AM

ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఏటా రూ. 20 వేలు అందించేలా కేటాయింపులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో ప్రకటించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) రైతులకు (Farmers) శుభవార్త (Good News) చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్దెట్టులో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ సిక్స్ (Super Six) సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేసింది. రాష్ట్రంలోఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఏటా రూ. 20 వేలు అందించేలా కేటాయింపులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) శాసనమండలిలో ప్రకటించారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేస్తోందన్నారు. మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయం రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు రెట్టింపు చేస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని మంత్రి తెలిపారు. కాగా తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు రాష్ట్ర బడ్జెట్ దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లు దాటింది. మరింత సమాచారం కోసం ఏబీఎన్ లైవ్ చూడండి..

ఈ వార్త కూడా చదవండి..

ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..

పోసాని రిమాండ్‌పై న్యాయవాది పొన్నవోలు ఎమన్నారంటే..

పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 28 , 2025 | 11:19 AM




News Hub