Sankranti 2025: సంక్రాంతి ఆటల పోటీల్లో లోకేశ్ కొడుకు ఏం చేశాడో చూడండి..

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:13 PM

నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం సందడి చేసింది. సంక్రాంతి పండుగ కోసం చంద్రబాబు కుటుంబం స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ జరిగిన ఆటల పోటీల్లో లోకేశ్ కుమారుడు దేవాన్ష్ సందడి చేశాడు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు కుటుంబాలంతా ఒకచోటకు చేరిపోతారు. పండుగ వేళ సరదగా ఆడుతూ.. పాడుతూ గడిపేస్తారు. అన్ని పండుగలు ఒక ఎత్తైతే.. సంక్రాంతి మరో ఎత్తు.. హోదాలతో సంబంధం లేకుండా సంక్రాంతి సంబరాల కోసం అంతా ఒకచోటకు చేరిపోతారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ తమ కుటుంబాలతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ స్థానిక పిల్లలతో కలిసి సందడి చేశాడు. దేవాన్ష్ ఆటచూసి అతడి తల్లి బ్రహ్మాణితో పాటు తండ్రి లోకేశ్, తాతయ్య చంద్రబాబు, నానమ్మ భువనేశ్వరి మురిసిపోయారు. అసలు దేవాన్ష్ ఏమి ఆట ఆడాడో ఈ వీడియోలో చూడండి..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 13 , 2025 | 04:13 PM