మహిళపై యువకుడి దాడి.. కారణం తెలిస్తే

ABN, Publish Date - Apr 10 , 2025 | 03:10 PM

Visakha Crime News: విశాఖలో దారుణం జరిగింది. మహిళపై యువకుడు కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

విశాఖపట్నం, ఏప్రిల్ 10: విశాఖ రైల్వే న్యూకాలనీలో కలకలం రేగింది. మహిళపై యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తనకు వేరొకరితో పెళ్లి సంబంధం చేస్తున్నారని మహిళ కుమార్తె యువకుడికి ఫోన్ చేసింది. దీంతో ఇంటికి వచ్చిన యువకుడు బాలిక తల్లిపై కత్తితో దాడి చేశాడు. స్వల్ప గాయాలతో యువకుడి నుంచి బాలిక తల్లి తప్పించుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కరుణాకరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.


మహిళ కుమార్తె ఫోన్ చేయడం వల్లే యువకుడు కత్తితో వచ్చి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మహిళపై యువకుడి దాడి విశాఖపట్నంలో (Visakhapatnam) సంచలనంగా మారింది.


ఇవి కూడా చదవండి

Dowry Harassment: ఎంత దారుణం.. మహిళను వివస్త్రను చేసి ఆపై

Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే

Read Latest AP News And Telugu News

Updated at - Apr 10 , 2025 | 03:10 PM