Home » 2024
భక్త కనకదాస జయంతిని కురుబ కులస్థులు సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంతో పాటు రూరల్ మండలం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు.
అంగనవాడీ సిబ్బంది విధులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట నిరసన చేపట్టారు.
పేరుకే కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దీంతో రోగు లు ఇది పెద్ద ఆస్పత్రి అని చికిత్స కోసం వస్తా రు. అయితే ఇక్కడి పరిస్థితులు అంతంత మా త్రంగానే ఉన్నాయి. దీంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వచ్చిన వారు నిరాశతో వేరొక చోటుకు వెళ్లాల్సి వస్తోంది. సోమ వారం ఆంధ్రజ్యోతి విజిట్లో ఈ విషయాలు బయటపడ్డాయి.
కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలన్నీ భక్తకోటితో కిక్కిరిసి పోయాయి. భక్తులు పెద్దఎత్తున దీపాలు వెలిగించి ముక్కంటిని దర్శించుకున్నారు. మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలోని శివుడికి రుద్రా భిషేకాలు, బిల్వార్చన, విశేష అలంకరణ చేశారు.
స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా అర్బన బ్యాంకు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్ నాయకత్వంలోని జట్టు మొదట బ్యాటింగ్ చేయగా.... 15 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తపోవనం నుంచి నవయుగ కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
మండలంలోని కోటంక సుబ్ర హ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష దీపారాధన కన్ను లపండువగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపారాధన నిర్వహించడం ఆనవాయితీ.
గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు.... గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది... అని నిత్యం ప్రజాప్రతినిధులు చేప్పేమాటలు. వాటిని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మరిచింది. ఎన్నికల ముం దు హడావుడిగా పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినా కార్యరూపం దాల్చింది అంతంత మాత్రమే.
జిల్లా విద్యాశాఖలో ఇప్పటికీ ‘వైసీపీ’ టీచర్లదే రాజ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మార్పు లేదు. గతంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో అడ్డగోలుగా వ్యవహరించిన ఆ పార్టీ వీరవిధేయులు ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎ్సఓ పోస్టుపై కన్నేశారు. ఎలాగైనా ఆ పోస్టును సొంతం చేసుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఓ టీచర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐటీ సెల్లోని ఈ ...
స్కూల్ గేమ్స్ ఫెడరేషన జా తీయ స్థాయి పోటీలకు బుక్కరాయ సము ద్రం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపి కయ్యారు. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బేస్బాల్, నెట్బాల్, బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ గోపాల్రెడ్డి తెలిపారు. బేస్బాల్ అండర్-17 లో పదోతరగతి విద్యార్థి మోహన ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొను న్నట్లు తెలిపారు.