Home » AarogyaSri
YS Sharmila Criticizes AP Govt: ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు.
చిన్నారులకు వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద ఇంతకాలం పిల్లలకు మూడేళ్ల వయసు వరకే ఈ శస్త్రచికిత్స చేయించుకునే వెసులుబాటు ఉండగా, దానిని ఐదేళ్ల వయసు వరకు ప్రభుత్వం పెంచింది.
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త(కోఆర్డినేటర్)ల నియామక ప్రక్రియ అంతా నిబంధనల మేరకే చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో టీ శివశంకర్ వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారింది. కార్యాలయంలో ఇద్దరు ముగ్గురు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. పదిరోజులుగా రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా అన్నిరకాల సేవలన్నింటిని నిలిపివేశాయి.
రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.
11 సంవత్సరాల తర్వాత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య చికిత్సల ధరలను సర్కారు సవరించింది. ఈ మేరకు 1,375 రకాల వైద్య చికిత్సల ధరలను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థు ఉత్తర్వ్యులను జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (తాషా) వెల్లడించింది.
తెలంగాణలో ఆరోగ్యశ్రీపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రేషన్ కార్డుతో లింకులు.. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకింత తీపి కబురే చెప్పారు...