Home » AB Venkateswara Rao
Andhrapradesh: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను (CAT) వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది.
తనపై రెండోసారి విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ‘సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్’ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్‌ని బెంచ్ పరిశీలించింది.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara rao) హైకోర్టులో పిటిషన్ వేశారు. తన విదేశీ పర్యటనను సీఎస్ తిరస్కరించటంపై పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. కాగా పిటిషన్‌పై విచారణ జరగగా నిర్ణయం మంగళవారానికి వాయిదాపడింది.