Home » Anna Canteen
Andhrapradesh: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చినట్టుగా ‘అన్న క్యాంటీన్లు’ పున:ప్రారంభమయ్యాయి. నిన్న (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్‌లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరాళాలు స్వీకరిస్తోంది. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారికోసం ఎస్‌బిఐలో ప్రత్యేక ఖాతాను తెరిచింది.
ఐదేళ్ళ వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమరావతి: పేదలకు కడుపునిండా రుచిగా.. శుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటిన్లు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో మొత్తం వంద క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. హరే రామ.. హరే కృష్ణ సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తోంది.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్‌లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.