Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:00 PM
ఏవియస్ ఇన్‌ప్లూఎంజా (బర్డ్‌ప్లూ) అనేది పక్షుల్లో వైరస్ వల్లకలిగే వ్యాధి అని, ఇది అంటు వ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా(Collector Prashant Kumar Mishra) అన్నారు.

బళ్లారి(బెంగళూరు): ఏవియస్ ఇన్‌ప్లూఎంజా (బర్డ్‌ప్లూ) అనేది పక్షుల్లో వైరస్ వల్లకలిగే వ్యాధి అని, ఇది అంటు వ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా(Collector Prashant Kumar Mishra) అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా చల్లని ప్రాంతాల నుంచి వలస పక్షులు సంతానోత్సత్తికి వచ్చినప్పుడు వాటి రెట్టలు, ఈకలు, నోరు, కళ్ల నుంచి వచ్చే స్రావాల ద్వారా వ్యాప్తి చెందే అవకాశంఉందని ఈ వ్యాధి పక్షులకు వ్యాపిస్తుందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Railway Station: నమ్మండి.. ఇది రైల్వేస్టేషనే..
ప్రజలు మాంసం, గుడ్లను 70డిగ్రీల వద్ద కనీసం 30నిమిషాలు ఉడికించినప్పుడు వైరస్ నాశనం అవుతుందన్నారు. మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినాలన్నారు. జిల్లాలో తొలిసారిగా ఫిబ్రవరి23న కురేకుప్ప పౌల్ట్రీ బ్రిడింగ్‌లో పెంచిన ఆసిల్, కావేరి జాతుల కోళ్లలో చికెన్ ప్లూ లక్షణాలు కనిపించాయి. కొన్ని చోట్ల చనిపోయాయి. చనిపోయిన కోళ్ల నమూలాలను తదుపరి పరీక్షల కోసం బెంగళూరు(Bengaluru)లోని ఐఏహెచ్ , వైబీహెచ్‌కి పంపారు.
భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ హై సెక్యూరిటీ యూనియన్ డీసీజ్ లాబోరేటరి నుంచి ధ్రువీకరించిన కేసు నివేధించబడిన తర్వాత బర్డ్‌ఫ్లూగా ప్రకటించారు. మార్గదర్శకాల ప్రకారం 2400 కోళ్లను శాస్త్రీయంగా పారేసినట్లు తెలిపారు. జిల్లాలోని కోళ్లు, బాతులు వలస పక్షులు అసాధారణంగా చనిపోతే వెంటనే సమీపంలోని పశువైద్య విభాగానికి సమాచారం ఇవ్వాలని జిల్లాపంచాయితీ ముఖ్యకార్యనిర్వహణాధికారి మహ్మద్ హరిస్ సుమేర్ అన్నారు. దరోజీ సరస్సు ప్రాంతానికి వివిధ రకాల పక్షులు వలస వస్తాయి. ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నామని ఆయన అన్నారు
అధికారుల సూచనలు
జిల్లాలో ఏవియస్ ఇన్‌ప్లూఎంజా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. కోళ్లలో ఏవైనా అసాధరణ మరణాలు కనిపిస్తే వెంటనే పశుసంవర్దక శాఖకు తెలియజేయాలని గ్రామపంచాయితీత పరిధిలోని కోడి మాంసం గుడ్లు అమ్మకాల దుకాణాల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సక్రమంగా పారవేసేందుకు చర్యలు తీసుకోవాలని కోళ్లఫాంల యజమానులను ఆదేశించినట్లు తెలిపారు. ఈసందర్భంగా పశుసంవర్దక, పశువైద్య సేవల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హనుమంత నాయక్ కరబారి, అసిస్టెంట్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు
ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..
ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి
Read Latest Telangana News and National News