Share News

Ballary: అయ్యోపాపం ఎంతఘోరం జరిగిందో.. పాదయాత్రగా వెళ్తూ మృత్యు ఒడిలోకి..

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:17 PM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గూళ్యం గ్రామంలో జరిగే గాదిలింగేశ్వర జోడు రథోత్సవ వేడుకలకు పాదయాత్రగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి చేరారు.

Ballary: అయ్యోపాపం ఎంతఘోరం జరిగిందో.. పాదయాత్రగా వెళ్తూ మృత్యు ఒడిలోకి..

బళ్లారి(కర్ణాటక): కర్నూలు జిల్లా ఆలూరు(Kurnool district Alur) నియోజకవర్గంలో గూళ్యం గ్రామంలో జరిగే గాదిలింగేశ్వర జోడు రథోత్సవ వేడుకలకు పాదయాత్రగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి చేరారు. బళ్లారి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌(Bommanahall) మండలం నేమకల్లు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి, వంధక్షి దంతుల కుమారుడు గణేష్‌(19) గాలి తిప్పేస్వామి, రత్నమ్మ దంపతులు కుమారుడు గాలి నాగరాజు(20) బొలెరో వాహనం ఢీకొని మృతిచెందారు. గణేష్‌, గాలి నాగరాజు, రామంజినేయులు, శివ తదితరులు కలసి సోమవారం సాయంత్రం 5 గంటలకు గ్రామం నుంచి పాదయాత్రగా బయలదేరారు.

ఈ వార్తను కూడా చదవండి: Hero Vishal: హీరో విశాల్‌ ప్రశ్న.. విజయ్‌ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..


pandu2.2.jpg

బళ్లారి మీదుగా గూళ్యం వెళ్తూ మోకా రోడ్డులో సంగనకల్లు గ్రామ సమీపంలో సిల్వర్‌ క్రాస్‌ వద్ద రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపక్కన పాదయాత్రగా వెళ్తున్నారు. గణేష్‌, గాలి నాగరాజు(Ganesh, Gali Nagaraju)లను మోకాకు చెందిన ఓ వ్యక్తి బొలెరో వాహనం అతివేగంగా వచ్చి డీ కొనింది. గణేష్‌, గాలి నాగరాజు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మిగతావారికి కొద్దిగా గాయాలయ్యాయి. బళ్లారి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నారు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోకసంద్రంలో నిండిపోయాయి.


ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు

ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్‌ పార్కులు

ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!

ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2025 | 01:46 PM