Home » Bathukamma
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. జార్జియాలో బతుకమ్మ పండుగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని (15-23) బతుకమ్మ వారంగా ప్రకటించారు.
డాలస్ నగరంలో ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్).. ఈ దఫా ఆ ప్రాంతమే మురిసిపోయేట్టు మరింత వేడుకగా నిర్వహించింది.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఓర్లాండోలో అక్టోబర్ 15వ తేదీన నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (Telangana Association of United Kingdom) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (Telugu Association of Greater Kansas City-TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (Telugu Alliances of Canada-TACA) ఆధ్వర్యంలో అక్టోబరు 21న (శనివారం రోజు) గ్రేటర్ టోరొంటోలోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రవాస తెలుగు, తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్ రన్ హైస్కూల్లో మద్యాహ్నం 12 నుండి- సాయంత్రం 7 గంటల వరకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు అత్యంత కన్నుల పండువగా జరిగాయి.
నగరంలోని టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు.
సిడ్నీలో బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF) ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.