Home » Bhimavaram
భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేశారు.
జనసేన యువనేత పోతిన వెంకట మహేష్ (Pothina venkata mahesh) సోమవారం నాడు ఆ పార్టీకి , పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి తీరని అన్యాయం చేశారని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పులపర్తి రామాంజనేయులను జనసేన (Janasena)లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.
Pawan Kalyan to contest from Bhimavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నేతలు పవన్ కల్యాణ్ పోటీపై కీలక సమాచారం అందిస్తున్నారు. పవన్ పోటీ దాదాపు ఖరారైంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అయితే.. ఆయన ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.
హెలికాప్టర్ ల్యాండింగ్‌కి అనుమతించకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.
భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు. ఇంటి ఎందుట పార్క్ చేసి
డిసెంబర్ 8వ తేదీన భీమవరం ( Bhimavaram ) లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం టూర్ షెడ్యూల్ ఖరారయింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ మళ్లీ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది. గతంలో అదే స్థానం నుంచి పవన్‌కళ్యాణ్ పోటీ చేశారు. తెలుగుదేశం మూడోస్థానంలో నిలిచినప్పటికీ మంచి ఓట్లునే సాధించింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లను కలిపితే మెజారిటీ దాదాపు 45 వేల వరకు ఉంటుంది. పొత్తులో అక్కడ సునాయాస విజయం తప్పదని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుందన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.