క్లస్టర్ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా వెంకట బసవరావు
ABN , Publish Date - Mar 18 , 2025 | 02:05 AM
క్లస్టర్ యూనివర్సిటీ ఇన్‌చార్జి ఉపకులపతిగా వెంకట బసవరావు బాధ్యతలు తీసుకున్నారు.

కర్నూలు అర్బన్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): క్లస్టర్ యూనివర్సిటీ ఇన్‌చార్జి ఉపకులపతిగా వెంకట బసవరావు బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం క్లస్టర్ యూనివర్సిటీలోని ఉపకులపతి చాంబర్లో ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం ఉద్యోగులు అభినందించారు. ప్రస్తుతం రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతిగా పని చేస్తున్న ఆయనకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి కోనా శశిధర్ ఇన్‌చార్జి వీసీగా కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పని చేసిన ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగోపాల్ పదవీ కాలం ఈనెల 3వ తేదీతో ముగియడంతో ఆ బాధ్యతలు రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. క్లస్టర్ వర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు, రాయలసీమ వర్సిటీ రిజిస్ట్రార్ బోయ విజయకుమార్, ప్రిన్సిపాల్స్ వీవీఎస్ కుమార్, ఇందిరా శాంతి, పాటు అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.